చిలకలూరిపేట
చిలకలూరిపేట పట్టణంలో సెక్టంబర్ రెండో తేదీ 2024 సంవత్సరంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జనసేన యువనాయకులు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో గణపవరంలోని మండలనేని కళ్యాణ మండపము నందు రక్తదాన శిబిరం తోపాటు, మొక్కల నాటడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు, తోట రాజా రమేష్, నవతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రక్త దాతలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.ఆ తదుపరి గడియార స్తంభం సెంటర్ నందు సుమారు 700 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కాపు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని అన్నసంతర్పణ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు. వారికి జనసేన యువ నాయకులు చరణ్ తేజ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.




Post A Comment:
0 comments: