సంక్రాంతి అంటే సంస్కృతి, సంప్రదాయాల్ని గుర్తుచేసుకునే పెద్ద పండగ.
ముత్యాల ముగ్గులు.. గొబ్బెమ్మల అలంకరణలు..
కొత్త పంటలు.. నోరూరించే వంటలు..
బంధుమిత్రుల సందడులు..
ఇలా ప్రతి ఇంటా పండగ శోభని తెచ్చే ఈ ఏడాది సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. అయిదేళ్ల వైకాపా చీకటి పాలనకు తెరదించి అన్ని వర్గాల్లో ఆనంద వెలుగులు నింపుతున్న కూటమి పాలనలో జరుగుతున్న తొలి పెద్ద పండగ ఇదే. అభివృద్ధి అంటే ఎరుగని గ్రామాలకు రోడ్లు నిర్మించి సంక్రాంతికి ముందే పల్లె పండగ ఏంటో కూటమి ప్రభుత్వం చూపించింది. ఎన్నికల్లో ఇచ్చిన పింఛన్ల మొత్తం పెంపు హామీని సర్కారు కొలువుతీరిన రోజునే అమలు చేసి పేదింట సంక్షేమ పండగను తెచ్చింది. ఈ మకర సంక్రాంతి తర్వాత యువతకు కొలువులు.. కర్షకులకు సిరులందించేలా కొత్త పథకాలను ఆచరణలోకి తీసుకువచ్చి అందరింటా భోగభాగ్యాలు నింపనుంది.
ముందుంది సంక్షేమ సంబరం..
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని సంక్షేమ పథకాలే గతేడాదే ఆచరణలో తెచ్చారు. మిగతా పథకాలన్నీ ఈ ఏడాదే అమలు చేయబోతున్నారు.
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారు. తల్లికి వందనం పథకం కూడా ఈ ఏడాది జూన్, జులైల్లో అందిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ పథకంలో సుమారు 4.10 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పీఏంఏవై 2.0 పథకం ద్వారా పేదలందరికీ గృహయోగం కల్పించనున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయబోతున్నారు.
పంట అమ్మిన రైతుకు ఒక్క రోజులోనే డబ్బులు చేతికి ఇచ్చి పండగకు ఇబ్బందుల్లేకుండా చూసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు పెట్టుబడి సాయం ఈ ఏడాదే అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ సంక్రాంతి యువతను సర్కారు కొలువుల వైపు తీసుకువెళుతోంది. గతేడాదే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేసినా సాంకేతిక చిక్కులతో నిర్వహించలేకపోయారు. ఈ ఏడాది జూన్‌లో మొదలుకానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే డీఎస్సీ నిర్వహించి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది.
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన రంగాలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోంది. అందులో గ్రామీణ రోడ్లు ఒకటి. పల్లె పండగ పేరుతో ఉపాధి నిధులతో కొత్త రోడ్ల నిర్మించి గ్రామాలకు పండగ కళ తీసుకొచ్చింది

Post A Comment:
0 comments: