వాడవాడలా ఏర్పాటైన జన్మదిన ఫ్లెక్సీలు
పండుగ వాతావరణంలో శుభాకాంక్షలు తెలపటానికి తరలివచ్చిన అభిమానులు
వేలాది మంది అన్నదానం, సేవా కార్యక్రమాలు
ఇంతమంది అభిమానులను అందించిన పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు.. చరణ్‌తేజ
చిలకలూరిపేట:
రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను త్రికరణ శుద్దిగా పాటిస్తూ పార్టీ బలోపేతానానికి కృషిచేస్తూ, మరోవైపు కష్టాల్లో ఉన్న వారిని నిస్వార్థంగా ఆదుకునే మానవతావాది మండలనేని చరణ్‌తేజ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. జనసేన నాయకులు మండల నేని చరణ్‌తేజ జన్మదినాన్ని బుధవారం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. చరణ్‌తేజకు శుభాకాంక్షలు తెలపటానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తరలి వచ్చారు. వారి సమక్షంలో జన్మదిన కేక్‌లను కట్ చేశారు. పూలమాలలు, శాలువలు కప్పి చరణ్‌తేజను సత్కరించారు. సూదీర్ఘ ప్రాంతాలల్లో ఉన్న పలువురు ప్రముఖులు చరణ్‌తేజకు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రధాన వీధుల్లో చరణ్ తేజకు శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్‌తేజ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలసి ఉన్న పెద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పెద్ద బెలున్లు ఎగుర వేసి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటు కున్నారు. గడియార స్థంబం సెంటర్‌తో పాటు పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేలాదిమందికి అన్నదానం చేశారు. పట్టణంలో చరణ్‌తేజ జన్మదినం సందర్బంగా జనసేన జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంతో చరణ్‌తేజ ముందంజలో ఉన్నారని కొనియాడారు. పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ జనసేన లో యువత భాగస్వామాన్ని పెంచారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకమౌతూ, వారికి భరోసా కల్పిస్తూ, వారి అవసరాలు తీరుస్తూ చరణ్‌తేజ గొప్ప నాయకుడిగా ఎదగారని ప్రశంసించారు. భావితతరానికి తన సేవా కార్యక్రమాల ద్వారా చరణ్‌తేజ స్పూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇంతమంది అభిమానులను అందించిన పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు.. చరణ్‌తేజ
ఈ సందర్బంగా మండలనేని చరణ్‌తేజ మాట్లాడుతూ వేలాది మంది అభిమానులను సంపాదించుకోవటానికి కారణమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. తన జన్మదినం సందర్బంగా విస్త్రత సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయటంతో పాటు, ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేనికులు, వీర మహిళలకు రుణపడి ఉంటాన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న సగటు ప్రజలకు సేవ చేయటానికి,వారికి అండగా నిలిచేలా పనిచేయాలని కోరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామా, గ్రామానా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన ఆవిర్బావ సభను విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి అవిర్బావ సభ చరిత్రలో నిలిచిపోయేలా పాటు పడాలని పిలుపు నిచ్చారు.

Post A Comment:
0 comments: