పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటిస్తారని అధికారులకు సమాచారం అందడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారని భావిస్తున్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాలతో గొల్లప్రోలులో తహసీల్దారు కార్యాలయ భవనం, యూపీహెచ్‌సీ భవన నిర్మాణ పనులను తహసీల్దార్ సత్యనారాయణ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజులుగా నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలని ప్రజా ఆరోగ్య శాఖ ఈఈ గంగరాజుకు సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ నాగసౌజన్య, రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మస్తాని, ఆర్‌ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment:
0 comments: