పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఇది విడుదల కానుంది. ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో తొలిభాగం మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా సినిమా నుంచి తొలిపాటను విడుదల చేసింది. ‘మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్ కల్యాణ్ ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు.

Post A Comment:
0 comments: