ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలని పలువురు తెదేపా నేతలు కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా తెదేపా, జనసేన (Janasena) నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈక్రమంలో జనసేన పార్టీ అధిష్ఠానం మంగళవారం స్పందించింది. ఇకపై ఈ వ్యవహారంలో పార్టీకి చెందిన నేతలెవరూ బాహాటంగా స్పందించవద్దని, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.


ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా  సోమవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. లోకేశ్‌ డిప్యూటీ  సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది.

Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: