రాష్ట్ర ప్రజలపై అదనంగా విద్యుత్‌ ఛార్జీల భారం మోపకుండా డిస్కంల రెవెన్యూ లోటు రూ. 14,683 కోట్లను భరించేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. ఆక్వా, ఎస్సీ, ఎస్టీలు, వివిధ వర్గాలకు రాయితీపై విద్యుత్‌ను అందించాలన్న నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)మూడు రోజుల పాటు విజయవాడ, కర్నూలు నగరాల్లో నిర్వహించిన బహిరంగ విచారణ శుక్రవారంతో ముగిసింది. ‘విద్యుత్‌ చట్టం-2003కు లోబడి ప్రభుత్వం వివిధ వర్గాల వినియోగదారులకు రాయితీపై విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీఈఆర్‌సీ నిర్వహించిన ఈ సమావేశంలో నిపుణులు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి పలు సూచనలు కమిషన్‌కు అందాయి. వాటిని క్రోడీకరించి..విద్యుత్‌ టారిఫ్‌ ఆర్డర్‌ను ఏపీఈఆర్‌సీ ఖరారు చేస్తుంది. ఇది ఏప్రిల్‌ నుంచి అమలులోకి వస్తుంది. డిస్కంలు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో (ఏఆర్‌ఆర్‌) విద్యుత్‌ ఛార్జీలు..క్యాటగిరీల మార్పు వంటి ప్రతిపాదనలు లేవు. ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు చూపిన లోటు మొత్తాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలపడంతో ఎలాంటి అదనపు భారం పడకుండా విద్యుత్‌ టారిఫ్‌ను ఏపీఈఆర్‌సీ ప్రకటించే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలో కీలక అంశాలు ఇలా ఉన్నాయి.



విద్యుత్‌ సంస్థల అప్పులు, నష్టాలు రూ. 1,01,139 కోట్లకు (2024 నవంబరు నాటి లెక్కల ప్రకారం) చేరాయి. ఇందులో అప్పులు రూ. 71,762 కోట్లుకాగా..నష్టాలు రూ. 29,377 కోట్లు. దేశంలో అతి తక్కువగా సరఫరా, పంపిణీ నష్టాలు ఉన్న విద్యుత్‌ సంస్థల్లో రాష్ట్ర డిస్కంలు కూడా ఉన్నా అవి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ పరిస్థితి నుంచి విద్యుత్‌ సంస్థలను గట్టెక్కించేందుకు విద్యుత్‌ కొనుగోళ్లలో పారదర్శకత, వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేందుకు తక్కువ ధరకు లభ్యమయ్యే పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.. ఇంధన పొదుపు చర్యలను ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎంచుకుంది. సరాసరి సరఫరా వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ సప్లయ్‌), సరాసరి రెవెన్యూ రియలైజేషన్‌ (కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌) మధ్య అంతరాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: