చిలకలూరిపేట: పగలు, రాత్రి తేడా తెలియకుండా, ప్రజలకు నిరంతరం సమాజ పరిస్థితులను అక్షరాల రూపంలో అస్త్రాలుగా సందించి వివిధ దిన పత్రికల్లో, న్యూస్ చానల్స్ లో వార్తల రూపంలో తెలియజేస్తూ, ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వానికి, నాయకులకు,ప్రజలకు వారదులుగా పాత్రికేయులు పని చేస్తుంటారని, నిరంతర శ్రామికులు, అలు పెరుగని సేవకులు, అక్షర హాలికులు, అయిన పాత్రికేయుల సేవలు ఎంత పొగడీ నా తక్కువేనని, వారి సేవలు అభినందనీయమని గురువారం జనసేన యువనాయకులు మండల నేని చరణ్ తేజ అన్నారు. నూతనంగా ప్రారంభించినజన స్వరం యూట్యూబ్ ఛానల్ లోగో ను ఆయన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్నపరెడ్డి సుధాకర్ ( ఆర్ఎంపీ వైద్యులు,) మేకపోతుల బొల్లయ్య, (టిడిపి నాయకులు) అన్నపరెడ్డి అంకమ్మరావు ( ఆర్ఎంపి) వైద్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post A Comment:
0 comments: