కంకిపాడు జనసేన(Janasena) పార్టీ చెందిన ముప్పా గోపాలకృష్ణ.. సంక్రాంతి వేడుకలను ఎంజాయ్ చేశారు. కోడి పందేల్లో పాల్గొనే వారికి ఆకర్షించేందుకు శిబిరాల వద్ద జనసేన పార్టీ ఫెక్సీలను, జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటుపై పలువురు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు కురిపించారు. ఈ విషయం జనసేన అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతో జనసేన జిల్లా కమిటీ సీరియస్ అయింది. పార్టీకి చెడ్డ పేరు వచ్చిందంటూ ముప్పా గోపాలకృష్ణను సస్పెండ్ చేసింది. కోడి పందేల ప్రాంగణంలో జనసేన ఫెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇందుకు బాధ్యులైన తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇకపై జనసేన కార్యక్రమాలతో తమకు ఎలాంటి అధికారిక సంబంధాలు లేవని పేర్కొంది

Post A Comment:
0 comments: