చిలకలూరిపేట పట్టణంలోని మండలం నేని నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలం నేని చరణ్ తేజ గారిని
శ్రీ గంగాభవాని ప్లంబర్స్ యూనియన్ కమిటీ నాయకులు, సభ్యులు గౌరవప్రదంగా కలిసి పూలమాలవేసి, డైరీ బహుకరించి నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకులు మాట్లాడుతూ 2024 ఏడాది మాత్రం అందరికీ ప్రత్యేకమని, గత ప్రభుత్వం అరాచక పాలన నుంచి జనానికి విముక్తి కల్పించిందని, ఐకమత్యంతో ఓటర్ల ముందుకొచ్చిన కూటమికి అఖండ విజయాన్ని అందించిందని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన ఘనమైన తీర్పుకు అనుగుణంగానే పాలనలో కూటమి సర్కారు మార్పును చూపుతోందని పేర్కొన్నారు. కష్టకాలంలో బాధితులకు బాసటగా నిలుస్తోంది. కొత్త ఏడాది ప్రగతి కానుక ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం హామి ఇచ్చిందన్నారు. అదేవిధంగా వారి ప్లంబర్స్ యూనియన్ ఇలా సత్కరించటం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు N పిచ్చేశ్వరరావు, కోశాధికారి కుప్పల శ్రీనివాసరావు, యూనియన్ సభ్యులు రమేష్ వీరితోపాటు జనసేన సైనికులు తదితరులు ఉన్నారు.

Post A Comment:
0 comments: