కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, ఆనందాలతో జీవితాలు నిండాలి.జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ
.
చిలకలూరిపేట:నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు, వీర మహిళలకు ఆరోగ్యం, ఆనందం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు ఈ నూతన సంవత్సరంలో కలగాలని జనసేన పార్టీ నాయకులు మండల నేని చరణ్‌తేజ బుధవారం అన్నారు . నూతన సంవత్సరం సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో జీవితాలు నిండిపోవాలని ఆకాంక్షించారు.. ఈ ఏడాదిలోనే కొత్త ఆశలతో సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరంలో నూతన ఒరవడితో నిర్మాణాత్మక సంక్షేమాభివృద్ది పథకాలు అమలు చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.

Post A Comment:
0 comments: