‘


ICC ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy-2025)లో విజేత‌గా భార‌త్ జట్టు నిలిచింది. నిన్న(ఆదివారం) దుబాయ్(Dubai) వేదిక‌గా న్యూజిలాండ్‌(New Zealand)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా అవతరించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు(Konidela Nagababu) టీమిండియా(Team India) విజయం పై స్పందించారు. ఆయన టీమిండియా విజయాన్ని, గత ఎన్నికల్లో జనసేన పార్టీ(Janasena Party) విజయంతో పోల్చారు.



ఈ క్రమంలో గెలుపుకు అదృష్టంతో సంబంధం లేదని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టు అన్ని మ్యాచుల్లోనూ టాస్ ఓడి విజయాన్ని నమోదు చేసిందని, 12 ఏళ్లకు ఛాంపియన్స్ ట్రోఫి సాధించిందని గుర్తుచేశారు. జనసేన పార్టీ కూడా 12 ఏళ్లకు జీరో ఎమ్మెల్యే నుంచి వంద శాతం స్ట్రైక్ రేటుతో 22 ఎమ్మెల్యేలు గెలిచిందన్నారు. ఈ విషయంలో రెండింటికీ ఒకే లాంటి పోలికలు కనిపిస్తున్నాయని కొణిదెల నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యంతో ఈ విజయాలు సాధ్యం అని నాగబాబు సోషల్ మీడియా(Social Media) వేదికగా పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకున్నందుకు ‘‘కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా’’ అంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలిపారు.

Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: