ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును అగ్రనాయకత్వం నిర్ణయం మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్తిపాడు పీహెచ్‌సీ ఘటనపై అందిన నివేదికలను, వివరణలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విధి నిర్వహణలో ఉన్న ప్రత్తిపాడు పీహెచ్‌సీ వైద్యురాలిపై.. అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడటం దురదృష్టకరమని అభిప్రాయపడింది.

Post A Comment:
0 comments: