జనసేన (janasena) నేతపై వైసీపీ నాయకుడు (YCP leader) కత్తితో దాడి (Attack with a knife) చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘోరమైన సంఘటన విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దాడికి పాల్పడిన వ్యక్తి, గాయపడిన వ్యక్తి ఇద్దరు గతంలో వైసీపీ (YCP) పార్టీలోనే ఉండేవారు. ఆ సమయంలోనే వైసీపీ నాయకుడు అయిన ధనంజయ (Dhananjaya) ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, మరో వైసీపీ నాయకుడు అయిన అక్కునాయుడు (AkkuNaidu)కు అమ్మాడు. ఆ స్థలంలో అక్క నాయుడు పండ్ల దుకాణం పెట్టుకున్నాడు. కాగా ఈ స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరగడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా.. వైసీపీ నాయకుడు అయిన ధనంజయ జనసేన పార్టీలో చేరి యాక్టీవ్ గా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కోర్టు పరిధిలో ఉన్న భూమి (land)లో అక్కునాయుడు మళ్లీ పండ్ల కొట్టు (Fruit shop)ను ఏర్పాటు చేశాడు. దీంతో ధనంజయ అక్కునాయుడుపై పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కునాయుడు స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న ధనంజయపై ఆదివారం రాత్రి కత్తితో దారుణంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ధనంజయ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దాడి అనంతరం నిందితుడు అక్కునాయుడు నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తుంది.

Post A Comment:
0 comments: