అన్ని మతాల్ని గౌరవించడం అంటే ఏమిటో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవాను చూసి వైకాపా అధ్యక్షుడు జగన్ నేర్చుకోవాలని మంత్రులు రామానాయుడు, వీరాంజనేయస్వామి, దుర్గేశ్, అనిత పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ‘డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని.. జగన్ తిరుమల వెళ్లడమే మానేశారు. ఆయన ఎప్పుడైనా సతీసమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా?’ అని ప్రశ్నించారు. ‘తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి నాస్తికుడు. దేవుడిని నమ్మరు.. ఆయన పిల్లల వివాహాలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. ఆయన హయాంలో తితిదే గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయి. విజిలెన్స్ అధికారులను కూడా లోపలకు రానీయలేదు’ అని ధ్వజమెత్తారు. ‘వైకాపా నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నరసన్నపేట నియోజకవర్గంలోని ఓ ఆలయంలోని గోడలపై జీసస్ నినాదాలు రాశారు. శ్రీకాకుళంలోని ఒక చర్చిలో జై శ్రీరామ్ అని రాశారు. ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉంటే ఏం చేస్తారో అదే జరుగుతోంది’ అని ధ్వజమెత్తారు.
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: