ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ (Mark shankar) సింగపూర్‌ స్కూల్లో ఏప్రిల్‌ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదం నుంచి మార్క్‌ సహా కొంతమంది చిన్నారులను నలుగురు భారతీయ వలస కార్మికులు కాపాడారు. ఇటీవల సింగపూర్‌ ప్రభుత్వం వారిని సత్కరించింది. తాజాగా వారికి ‘లైఫ్‌ సేవర్‌’ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలు పణంగాపెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పేర్కొంది.

ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. ‘‘మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారు. మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం’’ అని విచారం వ్యక్తంచేశారు.

సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లోని ఓ మూడంతస్తుల భవంతిలో ఈ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పని చేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని.. మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగి.. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.


Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: