వైకాపా హయాంలో ఐదేళ్లు రోడ్లపై గోతులూ పూడ్చక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆ కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తోంది. ‘పల్లె పండుగ’ పేరుతో ఊరూవాడా సీసీ రోడ్లు, కాలువలు, తారు రోడ్ల నిర్మాణాలు చేపడుతోంది. మన్యంలోని గ్రామాలకూ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబయలు వరకు 2 కి.మీ మేర తారు రోడ్డు నిర్మించారు. పచ్చటి అడవిలో నల్లగా మెరిసిపోతున్న రోడ్లను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేసినందుకు ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.


Post A Comment:
0 comments: