అమరావతి: ‘రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేద్దాం. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే ఇద్దాం. జోన్, నాన్‌ జోన్‌ అని లేకుండా ఎక్కడ ఆక్వా రైతు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా వారికి రాయితీపై విద్యుత్తు అందిద్దాం. రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే రాయితీపై విద్యుత్తు ఇవ్వబోం. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న  నిర్ణయాలు ఇవి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు రెండో రోజు (బుధవారం) తీసుకున్న  అనేక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. విశాఖనగరం చుట్టుపక్కల ప్రాంతాలు ఒక హబ్‌గా.. రాజమహేంద్రవరం-కొవ్వూరు సమీప ప్రాంతాలు గోదావరి హబ్‌గానూ, అమరావతి-విజయవాడ, కర్నూలు, సత్యసాయి, అనంతపురాలు మరో హబ్‌గా, తిరుపతి చుట్టుపక్కల పంచాయతీలు ఆ కార్పొరేషన్‌తో కలిపి మరొకటి.. ఇలా ఐదు హబ్‌లను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి నీతి ఆయోగ్‌ ఒక నివేదిక సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో హిందూపూర్, అనంతపురం మధ్య మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. 


మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ది పనులను ఇప్పటి నుంచే చేపడదామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది నవంబరులో సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని, అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు

Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: