రాష్ట్రంలో నాలా (వ్యవసాయేతర భూమి) చట్టం రద్దు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధి నిరోధకంగా ఉండే ఏ చట్టాన్నయినా తీసేస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాలా అనేది పెద్ద సమస్యగా తయారైంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డబ్బు వసూలుకు కేంద్రంగా మార్చేశారు. రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. అందుకే నాలా రద్దు చేస్తున్నాం. ఈ మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై చర్చిస్తాం. అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం. నాలా పాత బకాయిలు ఉంటే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తాం. దరఖాస్తు చేసినరోజు ఉన్న రేటే వసూలు చేస్తాం. వడ్డీ, జరిమానా కూడా తీసేస్తాం’ అని వివరించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఉండాలని.. ప్రజాప్రతినిధుల్ని విశ్వాసంలోకి తీసుకుని పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ‘నాయకుడిగా పనిచేయండి.. అనుచరుడిగా కాదు. సీఎస్, కార్యదర్శులు చెప్పారని కాకుండా మీ ఆలోచనలకు పదునుపెట్టండి’ అని సూచించారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమలు పెట్టేవారికి రియల్‌టైమ్ విధానంలో అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
.jpeg)
Post A Comment:
0 comments: