పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం పవన్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేస్తానని నిర్మాతలకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.ప్రజెంట్ పవన్, జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో రాబోతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu)షూట్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అనసూయ, పూజితా పొన్నాడ (Poojita Ponnada)కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రెండు పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో అందరి దృష్టి మూడో పాటపై పడింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ఏప్రిల్ 14 వరకు షూటింగ్‌కు కంప్లీట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ థర్డ్ సింగిల్‌కు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అలాగే నాలుగో పాటను ఏప్రిల్ 15న విడుదల చేయాలని అకుకుంటున్నట్లు టాక్. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయితే ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Post A Comment:
0 comments: