ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని (60) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా ధ్రువీకరించారు. హుసైని (Shihan Hussaini) మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా.. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌కల్యాణ్‌కు హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
షిహాన్ హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమా గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారుచేశారు.

Post A Comment:
0 comments: