ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతి-పళని(Tirupati-Palani) మధ్య ఆర్టీసీ బస్సు(RTC BUS) కొత్త సర్వీసులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్(RTC Chairman) కొనకళ్ల నారాయణ(Konakalla narayana) హాజరయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఆర్టీసీ సర్వీసును ఘనంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో తమిళనాడు(Tamilnadu)లో దైవ దర్శనాలకు వెళ్లినప్పుడు నేరుగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు(Devotees) పవన్ కళ్యాణ్‌ను కోరారని గుర్తుచేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లగానే ఆమోదించారని చెప్పారు. తిరుపతి-పళని బస్సు సర్వీస్ ప్రారంభించడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ క్రమంలో భక్తులు అడగటంతో ఏర్పాటు చేయడం జరిగిందని పవన్ తెలిపారు. 505 కి.మీ దూరాన్ని ఈ బస్సు 11 గంటల్లో చేరుతుందని చెప్పారు. రోజూ టీపీటీవై, పళనిలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరి చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా గమ్యం చేరుతాయి. ఈ ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెద్దలకు రూ.680, పిల్లలకు రూ.380గా నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


Axact

Axact

చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి **************************** చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ సాయి

Post A Comment:

0 comments: