TRENDING NOW

 


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే యూత్‌లో ఓ విచిత్రమైన వైబ్రేషన్‌. కేవలం తను చేసే సినిమాలతోనే కాదు, సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, ఎవరికి అన్యాయం జరిగినా చలించిపోయే తత్వం ఆయన్ని ప్రజలకు బాగా దగ్గర చేసింది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచే సాధనం అని భావించే పవన్‌కళ్యాణ్‌ తన ప్రతి సినిమాలోనూ యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేసే ఏదో ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఒక యంగ్‌ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పవర్‌స్టార్‌గా తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్‌ చేసుకున్న పవన్‌కళ్యాణ్‌.. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి ప్రవేశించి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్‌ రాష్ట్ర ప్రజలకు తన విలువైన సేవలు అందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్‌ ఏమిటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 


ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు మహామహులు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో ఓ సాధారణ నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. తన డాన్సులతో, ఫైట్స్‌తో, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ ఎదుగుతూ మెగాస్టార్‌ స్థాయికి ఎదిగారు. చిరంజీవితోపాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు వారి ఇమేజ్‌కి తగ్గట్టు సినిమాలు చేస్తూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలోనే మెరికలాంటి కుర్రాడు టాలీవుడ్‌లో మెరిశాడు. మెగాస్టార్‌ చిరంజీవి సోదురుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు. అతనే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. 


అప్పటికే ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలో ప్రవేశించారు. నటనలోనూ, డాన్సుల్లోనూ చిరంజీవిని అనుకరిస్తూ వచ్చారు. అయితే పవన్‌కళ్యాణ్‌ మాత్రం చిరంజీవి ప్రభావం తనపై ఒక్క శాతం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. 1996లో మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తనలోని టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తను క్రియేట్‌ చేసుకున్న ప్రత్యేకమైన స్టైల్‌, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో యూత్‌ని విపరీతంగా ఆకర్షించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఐదు వరస సూపర్‌హిట్స్‌తో స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. 


2001 పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌కి ఎంతో కీలకమైన సంవత్సరంగా మారింది. తమిళ్‌లో విజయ్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఖుషి ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలంటే ఎ.ఎం.రత్నంకి కనిపించిన ఏకైక ఆప్షన్‌ పవన్‌కళ్యాణ్‌. ఆ సినిమా పవన్‌కి కూడా విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పారు. తమిళ్‌ హీరో విజయ్‌ పోకడలు తెలుగు వెర్షన్‌లో ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు పవన్‌. 2001 ఏప్రిల్‌ 27న విడుదలైన ఖుషి.. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. అప్పటివరకు చేసిన సూపర్‌హిట్‌ సినిమాలు ఒక ఎత్తయితే.. ఖుషి  పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌కి ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది. 


‘ఖుషి’ చిత్రం విడుదలైన రెండు సంవత్సరాల వరకు పవన్‌ మరో సినిమా చెయ్యలేదు. తన దర్శకత్వంలోనే రూపొందించిన జాని చిత్రం కోసం చాలా గ్యాప్‌ తీసుకున్నారు పవన్‌. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ప్రభావం.. పవన్‌ చేసిన తర్వాతి సినిమాలపై పడింది. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వగా, మరికొన్ని ఏవరేజ్‌గా నిలిచాయి. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన జల్సా చిత్రంతో తన పూర్వవైభవాన్ని సాధించారు పవన్‌. ఈ సినిమా తర్వాత కూడా మరికొన్ని ఫ్లాప్‌లు అతన్ని వెంటాడాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేసిన గబ్బర్‌సింగ్‌ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి, పవన్‌లోని కొత్తకోణాన్ని పరిచయం చేసింది. ఆ తర్వాతి సంవత్సరం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పవన్‌ కెరీర్‌ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టీ పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలపైనే ఉంది. డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉన్న పవన్‌ ఈ మూడు సినిమాలను పూర్తి చెయ్యాల్సి ఉంది. తమ అభిమాన హీరో ఎప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వస్తారు, ఎప్పుడు థియేటర్లలో పవర్‌స్టార్‌ సినిమా చూస్తాము అంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 


 


ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి, చేయిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి పనుల్ని ప్రధాని మోదీ మే 2న పునఃప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని రైతులంతా కుటుంబసభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారు.


ఆ సందర్భంగా రాజధాని రైతులు తమ ఆకాంక్షల్ని ఆయన ముందుంచారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని రైతులు కోరారు. ఎన్డీయేలో తెదేపా కీలక భాగస్వామిగా ఉన్నందున చంద్రబాబు చెబితే ప్రధాని మోదీ వింటారని వారు పేర్కొన్నారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ... ‘అది మన పరిధిలోని అంశం కాదు. మనం డిమాండ్‌ చేయకూడదు. సామరస్యంగా అన్నీ సాధించుకుందాం’ అని పేర్కొన్నారు. మే రెండో తేదీ రాష్ట్ర చరిత్రలో మైలురాయి కాబోతోందని.. రాజధాని నిర్మాణంలో ఇదో కీలక ముందడుగు అవుతుందని ఆయన తెలిపారు. రైతుల త్యాగం వల్లే అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని.. వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించి... వారి సందేహాలు నివృత్తి చేశారు. రైతులకిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను సత్వరం పరిష్కరిస్తామని, రుణాలిప్పించేలా బ్యాంకులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రాజధానివాసులకు అండగా ఉండేందుకు, భరోసా కల్పించేందుకే తానూ అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో తమ చర్చల సారాంశాన్ని అనంతరం రాజధాని రైతులు విలేకర్లకు వెల్లడించారు. 

 


ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ (Mark shankar) సింగపూర్‌ స్కూల్లో ఏప్రిల్‌ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదం నుంచి మార్క్‌ సహా కొంతమంది చిన్నారులను నలుగురు భారతీయ వలస కార్మికులు కాపాడారు. ఇటీవల సింగపూర్‌ ప్రభుత్వం వారిని సత్కరించింది. తాజాగా వారికి ‘లైఫ్‌ సేవర్‌’ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలు పణంగాపెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సింగపూర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పేర్కొంది.

ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. ‘‘మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారు. మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం’’ అని విచారం వ్యక్తంచేశారు.

సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లోని ఓ మూడంతస్తుల భవంతిలో ఈ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పని చేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని.. మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగి.. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.




అన్ని మతాల్ని గౌరవించడం అంటే ఏమిటో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవాను చూసి వైకాపా అధ్యక్షుడు జగన్‌ నేర్చుకోవాలని మంత్రులు రామానాయుడు, వీరాంజనేయస్వామి, దుర్గేశ్, అనిత పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ‘డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వస్తుందని.. జగన్‌ తిరుమల వెళ్లడమే మానేశారు. ఆయన ఎప్పుడైనా సతీసమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా?’ అని ప్రశ్నించారు. ‘తితిదే మాజీ ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి నాస్తికుడు. దేవుడిని నమ్మరు.. ఆయన పిల్లల వివాహాలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. ఆయన హయాంలో తితిదే గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయి. విజిలెన్స్‌ అధికారులను కూడా లోపలకు రానీయలేదు’ అని ధ్వజమెత్తారు. ‘వైకాపా నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నరసన్నపేట నియోజకవర్గంలోని ఓ ఆలయంలోని గోడలపై జీసస్‌ నినాదాలు రాశారు. శ్రీకాకుళంలోని ఒక చర్చిలో జై శ్రీరామ్‌ అని రాశారు. ఒక క్రిమినల్‌ రాజకీయాల్లో ఉంటే ఏం చేస్తారో అదే జరుగుతోంది’ అని ధ్వజమెత్తారు. 




చిలకలూరిపేట:

మంగళవారం రాత్రి పురుషోత్తం పట్నం,శ్రీ పోలేరమ్మ  తల్లి దేవస్థానం పదవ వార్షికోత్సవం సందర్భంగా 108 కేజీల మల్లెపూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ , యువ నాయకుడు మండల నేని చరణ్ తేజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేర‌మ్మ త‌ల్లి ద‌య‌తో రాష్ట్రం సుభిక్షంగా వ‌ర్ధ‌ల్లాల‌ని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ వారు మండలనేని చరణ్ తేజ కుతోట రాజా రమేష్ లకు పూల మాలలతో శాల్వలతో చిరు సన్మానం చేసారు.అలాగే వేద పండితులతో అమ్మవారి ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునీర్ హసన్, కూరపాటి శివశంకర్, సాంబ, సూర్య, వెంకీ, అచ్చు కోల వెంకటప్పయ్య, అయ్యప్ప స్వామి నాయుడు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 


 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇంటికి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun) మెగా అభిమానులతో పాటు, తన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. ఇటీవల సింగపూర్ లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరగడంతో అతను గాయాలపాలయ్యాడు. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డ మార్క్ శంకర్ (Mark Shankar) ను పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. దీంతో అగ్ని ప్రమాదంలో గాయాలై.. ఆస్పత్రిలో చికిత్స అనంతరం భారత్ వచ్చిన మార్క్ శంకర్ ను చూసేందుకు అల్లు అర్జున్ సోమవారం రాత్రి మెగా హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇంటికి చేరుకున్నారు. తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్, స్నేహలు మార్క్ శంకర్ (Mark Shankar) తో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.


ఇదిలా ఉంటే గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ (Allu Arjun) తన పవన్ కు వ్యతిరేకంగా, తన వైసీపీ అభ్యర్థి అయిన తన స్నేహితుడి తరుపున ప్రచారం చేశారు. దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్, మెగా అభిమానుల (Mega fans) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు ఉంది. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పుష్ప 2 భారీ విజయం సాధించడంలో అల్లు అర్జున్ తనకు మెగా ఫ్యామిలీ తో ఎటువంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారనే చెప్పుకొవాలి.


 


రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఏపీ(Andhra Pradesh)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో నూతన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నేటి నుంచే ప్రారంభించనుంది.

ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర’(Mana Mitra) పేరిట వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance) సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పై ప్రజలలో అవగాహన కల్పించాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో మన మిత్ర కార్యక్రమాన్ని ప్రతి గడపకూ చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు(మంగళవారం) నుంచి ఇంటింటికీ మనమిత్ర కార్యక్రమాన్ని అమలు చేయనుంది. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది.. మన మిత్ర కార్యక్రమం పై ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో వారు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దానిని ఎలా ఉపయోగించాలో ప్రజలకు తెలియజేస్తారు. ప్రస్తుతం250కి పైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500కు విస్తరించనున్నట్లు తెలుస్తోంది.